YS Sharmila reaction on AP party : ఏం అక్కడ పార్టీ పెట్టకూడదా.. అలా అని రూల్ ఉందా? వైఎస్ షర్మిల కామెంట్స్!

YS Sharmila party in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమె చేసిన కామెంట్స్ ఏమిటో చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 07:02 PM IST
  • ఏపీలో పార్టీ ఏర్పాటుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందన
  • పొలిటికల్ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు అంటూ కామెంట్స్
YS Sharmila reaction on AP party : ఏం అక్కడ పార్టీ పెట్టకూడదా.. అలా అని రూల్ ఉందా? వైఎస్ షర్మిల కామెంట్స్!

YSRTP chief YS Sharmila reaction on launch party in Andhra Pradesh : ఏపీలో పార్టీ ఏర్పాటుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. తాజాగా మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఏర్పాటు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. పొలిటికల్ పార్టీ (Political party) ఎక్కడైనా పెట్టొచ్చు అని పేర్కొన్నారు. పార్టీ పెట్టకూడదనే రూల్ లేదు కదా అంటూ ప్రశ్నించారు వైఎస్‌ షర్మిల. (YS Sharmila) తాము ఒక మార్గాన్ని ఎంచుకున్నామని, దాని ప్రకారం ముందుకెళ్తున్నామంటూ షర్మిల పేర్కొన్నారు.

అయితే తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీ పెట్టడం తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఏమాత్రం ఇష్టం లేదు. అయినా కూడా వైఎష్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ముందుకెళ్తోంది. ఇక తాజాగా షర్మిల (Sharmila) చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో (AP politics) షర్మిల సంచలనాలకు తెర లేపనున్నారా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన అన్న జగన్‌ను (Jagan) ఎదురించి తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. 

షర్మిలకు తెలంగాణలో పార్టీ వద్దని వైఎస్ జగన్ చెప్పారంటూ గతంలో ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణ మీడియా ఎదుట చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysr telangana party) ఏర్పాటు తర్వాత... వైఎస్ జగన్‌తో అసలు కలవలేదు వైఎస్ షర్మిల. 

తండ్రి వైఎస్సార్ (ysr) జయంత్రి, వర్ధంతి కార్యక్రమాల్లో ఇద్దరూ వేర్వేరుగా పాల్గొంటున్నారు. అలాగే గతంలో ప్రతి సంవత్సరం వైఎస్‌ జగన్‌తో కలిసి నిర్వహించుకునే క్రిస్మస్‌ వేడుకలకు కూడా షర్మిల దూరంగా ఉంటున్నారు. 

తెలంగాణలో పాదయాత్రతో పార్టీ పరుగులు పెట్టించే ప్రయత్నం చేసిన వైఎస్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పొలిటికల్ పార్టీ (Political party) పెట్చొచ్చు.. అలా పెట్టకూడదనే రూల్ లేదు కదా అంటూ షర్మిల చేసిన కామెంట్స్ చూస్తుంటే ఏపీలో కూడా షర్మిల పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

Also Read : Train Viral News: ఓ వైపు వేగంగా రైలు దూసుకొస్తోంది.. పట్టాలపై పడుకున్నాడు.. ఏం జరిగింది?

ఇక వైఎస్సార్టీపీలో (YSRTP) టీడీపీ సీనియర్‌ నేత గట్టు రాంచందర్‌రావు తాజాగా చేరారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్టీపీ కార్యాలయంలో ఆయన పార్టీ చీఫ్ వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు.

Also Read : Telangana Lock down: తెలంగాణలో ఈ నెలాఖరు నుంచి లాక్​డౌన్​?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News