CM Jagan Mohan Reddy Narasapuram Tour: నరసాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేవుడి దయతో ఇవాళ నర్సాపురంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఒకే రోజులో ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బహుశా నరసాపురం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నామని.. ఈ ప్రాంతం రూపురేఖలు మార్చబోతోందని సీఎం అన్నారు. ఆక్వా కల్చర్‌ ఈప్రాంతంలో ప్రధానమైనదని.. వాటి ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. దేశంలో రెండే రెండు ఫిషరీస్‌ యూనివర్శిటీలు ఉన్నాయని.. ఒకటి తమిళనాడులో, మరొకటి కేరళలో, మూడో యూనివర్శిటీ మన రాష్ట్రంలో రాబోతోందని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నర్సాపురం అగ్రికల్చర్‌ కంపెనీ భూములపై రైతులకు పూర్తిహక్కులు కల్పిస్తున్నామని.. 1623 మంది రైతులకు మేలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఎన్నికలప్పుడు తాను చెప్పానని.. దాన్ని ఇవాళ నిలబెట్టుకుంటున్నామన్నారు. శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌  చేసి పట్టాలు ఇవ్వబోతోందని.. కేవలం ఎకరాకు 100 రూపాయలు చెల్లిస్తే చాలు రైతుల పేరుతోనే భూములు ఇస్తున్నామని తెలిపారు. నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయని అన్నారు.
 
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు తమ నోటికి ఈ మధ్య ఎక్కువగా పనిచెప్తున్నారని అన్నారు. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా.. జనసేన అంటే రౌడీ సేనగా మార్చేశారని ఎద్దేవా చేశారు. గతంలో కలిసి చేసిన పాలనను ఇదేం ఖర్మరా బాబూ అనుకోబట్టే.. 2019లో దత్త పుత్రుడ్ని, సొంతపుత్రుడ్ని.. అన్నిచోట్లా కూడా ఓడగొట్టి బైబై చెప్పారని అన్నారు.


''1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ ‌కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, తన పార్టీలో, తన కేబినెట్లో స్థానం ఇచ్చినందుకు తానుకూడా ఇదేం ఖర్మంరా బాబూ అని తానుకూడా అనుకుని ఉంటాడు. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండడం ఇదేం ఖర్మరా బాబూ అని రాష్ట్రవ్యాప్తంగా అనుకుంటున్న మాటలు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు అన్న మాటలు.. తాను రాజకీయాల్లో ఉండాలంటే అసెంబ్లీకి వెళ్లాలంటే.. ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. సరేసరి.. అని ప్రజల్ని కూడా బెదరిస్తున్నాడు. చివరకు కుప్పంలోనే గెలవలేనన్న భయం, నిరాశ, నిస్పృహలు.. చంద్రబాబు మాటల్లో, చేష్టల్లో కనిపిస్తున్నాయి.    ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు, ఆయన ప్రవర్తిస్తున్న తీరును చూస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌ టవర్ ‌నుంచి దూకేస్తానంటారు.. రైళ్ల కింద పడిపోతానంటారు.. పురుగులమందు తాగేస్తానంటారు..


చంద్రబాబు అధికార భగ్నప్రేమికుడు.. రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నాడు. చేయని పనులకు ఎందుకు ప్రజలు ఓటేస్తారు..? ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. వాళ్లకు సంబంధించిన నాలుగు  పేపర్లు, టీవీలు.. ఇలాంటి వాళ్లందరితో వీళ్లంతా కూడా దోచుకో.. పంచుకో.. తినుకో.. అని ఒక ఒప్పందం చేసుకుంటారు. ప్రశ్నిస్తానన్న కొందరు కూడా ప్రశ్నించరు. వీళ్లందరిన్నీ చూసినప్పుడు ఇదేం ఖర్మరా బాబూ అని అనిపిస్తుంది. మీ ఇంట్లో మంచి జరిగిందా..? లేదా..? అని కొలమానంగా చూసుకోండి.    మంచి జరిగితే.. మీ తమ్ముడికి, మీ అన్నకి, మీ బిడ్డకి తోడుగా నిలబడండి..'' అని సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 


Also Read: UPI Payments: ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్స్ చేయండి.. ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి చాలు  


Also Read: Rhino In Football Ground: ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి