Ysr Rythu Bharosa: ఏలూరు జిల్లాలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో నిర్వహించిన రైతు రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద నిధులు విడుదల చేశారు. వేదికపైనే బటన్ నొక్కి అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేశారు సీఎం జగన్.  ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడు రైతు పరామర్శ పేరుతో బయలు దేరాడని.. కాని  పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్ని చూపించలేకపోయారంటూ పవన్ పై విమర్శలు చేశారు.చంద్రబాబుపై ప్రేమ చూపిస్తున్నదత్తపుత్రుడు.. గతంలో రైతు సమస్యలపై ఏనాడైనా ప్రశ్నించారా అని జగన్ నిలదీశారు. ఉచిత విద్యుత్ వద్దు.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు సీఎం జగన్.రైతులపై కాల్పులు జరిపించిన నాయకుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రైతలకు మోసం జరిగిదే దుష్టచతుష్టయం ప్రశ్నించలేదని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవు.. ఎక్కడా వివక్ష లేదన్నారు సీఎం జగన్.కేంద్రం ప్రకటించని పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేశామన్నారు. ఆక్వాజోన్ రైతులకు విద్యుత్ రాయితీలు కల్పిస్తామని తెలిపారు. మోసం చేయడం తనకు తెలియదన్న జగన్..  ప్రజలకు సేవ చేయడం కోసమే పని చేస్తానని చెప్పారు. తాను చెప్పిందే చేస్తానని.. రాజకీయాలతో సంబంధం లేకుండా చేస్తానని తెలిపారు. నేను మీ బిడ్డను.. నిజాయితగా పని చేస్తా.. ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా ఉండను అంటూ ఉద్వేగంగా మాట్లాడారు ఏపీ సీఎం జగన్.  టీడీపీ మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసేశారు... మా నేతలు మా మేనిఫెస్టో పట్టుకుని ఇంటింటికి వస్తున్నారు.. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలని ప్రజలను కోరారు.


రాష్ట్రంలో మూడేళ్లలో కరువు లేదని, అనంతపురం జిల్లాలో కూా భూగర్భ జలాలు పెరిగాయని సీఎం జగన్ అన్నారు. రైతు భరోసా కింద 23 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా నిధులు విడుదల చేస్తున్నామని.. ఎన్నడూ లేని విధంగా మూడేళ్లలో రైతుల కోసం లక్షా 10 వేల కోట్లు ఇచ్చామని వెల్లడించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. కౌలు రైతులను ఆదుకుంటున్నామని, ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం ఇస్తున్నామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ఒక్క రైతును కూడా ఆదుకోలేదని విమర్శించారు.రైతులకు ఏటా 13 వేల 5 వందల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. అక్కడ రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. పంటల సాగు, దిగుబడికి సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


READ ALSO: Power Charges Hike: వినియోగం పెరగకపోయినా డబుల్... జనాలకు షాకిస్తున్న కరెంట్ బిల్లులు


READ ALSO: MLA Jagga Reddy Dance: ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీన్మార్ స్టెప్పులు.. ఎందుకో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook