CM Jagan Review: పౌరసరఫరాల శాఖతో ఆర్‌బీకేల అనుసంధానంపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలపై సమీక్ష నిర్వహించిన ఆయన..పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి డిపార్ట్‌మెంట్ల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఇకపై అధికారులంతా కలిసి పనిచేయాలని ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహించి..రైతులకు సాయిల్ కార్డులు ఇవ్వాలన్నారు సీఎం జగన్. సాయిల్ కార్డులు అందించడంతోపాటు రైతులకు అవరసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. భూమికి సంబంధించిన ఎరువులు, పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్నారు సీఎం జగన్. రైతులకు ఎంఎస్‌పీ ధర కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని తేల్చి చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సివిల్ సప్లై కమిషనర్ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సి.హరికిరణ్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, సివిల్ సప్లై కార్పొరేషన్‌ వీసీ అండ్ ఎండీ వీర పాండ్యన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


 


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వాయు'గండం'..రాగల మూడు రోజులపాటు తస్మాత్ జాగ్రత్త..!


Also read:Venkaiah Naidu Farewell: ప్రధాని మోడీ ఉద్వేగం.. వెంకయ్య కన్నీళ్లపర్వం! రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook