Asani Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అసనీ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లో కల్లోలం రేపుతోంది. అతి తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్ గా మారిన అసనీ.. తీరంవైపు దూసుకొస్తోంది. తుఫాన్ తీవ్రత తగ్గినా.. ఏపీలో దాని ప్రభావం భారీగానే ఉంది. ఆసనీ ఎఫెక్ట్ తో కోస్తాంధ్ర జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమతో పాటు గుంటూరు, బాపట్ల , మచిలిపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం అసనీ వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు బీభత్సం స్పష్టిస్తుండటంతో నష్టం తీవ్రంగానే ఉంటోంది. లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసనీ తుఫాన్ పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  క్షేత్రస్థాయి పరిస్థితిని జగన్ ఆరా తీశారు. సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో అలర్ట్ గా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు. ముంపు ఎక్కువగా ఉన్న ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని ఆదేశించారు. అవసరానికి సరపడా సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు  ఏపీ ముఖ్యమంత్రి. తుపాను ప్రభావిత కుటుంబాలకు రెండు వేల రూపాయలు సాయం అందించాలని ఆదేశించారు. వ్యక్తికి అయితే వెయ్యి రూపాయలు ఇవ్వాలని సూచించారు.


అసనీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు NDRF, SDRF బృందాలను తరిలించారు. 9 రెస్క్యూ టీమ్ లు ఫీల్డ్ లో ఉన్నాయని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు అలర్ట్ గా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు సీఎం జగన్. ఇప్పటికే నిధులు ఇచ్చామని.. ఇంకా ఇస్తామని.. ప్రజలకు సరిపడా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. తుఫాన్ బాధితుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలని, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించి ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లు నిరంతరంగా పని చేయాలని ఆదేశించారు. బాధితుల నుంచి వచ్చే కాల్స్ పై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.  


READ ALSO: Cyclone Asani Live Updates: అసని తుపాన్ లేటెస్ట్ అప్‌డేట్స్... ఇప్పటివరకూ ఐదుసార్లు దిశ మార్చుకున్న తుఫాన్..


READ ALSO: Vijaysai Reddy On Narayana: పేపర్ లీక్ చేశారని పద్మశ్రీ ఇవ్వాలా..! చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook