Davos Summit: తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో ఉన్నారు. యూరప్ టూర్ లో భాగంగా మొదటగా లండన్ వెళ్లిన కేటీఆర్.. బుధవారం అక్కడ బిజిబిజీగా గడిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 22న దావోస్ వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు నేతలు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో సమావేశాలు నిర్వహించబోతున్నారు. మంత్రి కేటీఆర్ ప్రతి ఏటా దావోస్ వెళ్తున్నారు. కాని ఏపీ సీఎం జగన్ కి  మాత్రం అధికారికంగా ఇదే తొలి దావోస్ టూర్. అందుకే ఇద్దరు నేతలు అక్కడ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. యూరప్ లోని తెలుగు ఎన్నారైలు జగన్, కేటీఆర్ లతో ప్రత్యేక సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో కీలక సమావేశాలు జరుగుతాయి.అంతర్జాతీయంగా పేరున్న సంస్థల ఇక్కడి రానున్నాయి. జాతీయ స్థాయిలోని ప్రముఖులు సైతం దావోస్ వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దావోస్ సదస్సులో పాల్గొననున్నారు. దీంతో ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ పెట్టుబడుల సాధనలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది చర్చగా మారింది. ఏపీ ముఖ్యమంత్రిగా తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు జగన్. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా.. ప్రతి ఏటా ఆయన దావోస్ వెళ్లేవారు. అక్కడ బాగా హడావుడి చేసేవారు. ఒప్పందాలు, అగ్రిమెంట్లు భారీగానే జరిగేవి. కాని కొవిడ్ కారణంగా గత రెండేళ్లు పెట్టుబడుల సదస్సులు జరగలేదు. దీంతో ఈసారి దావోస్ సమ్మిట్ ప్రాధాన్యత సంతరించుకుంది.  


ఇక లండన్ లో కేటీఆర్ ను బ్రిటీష్ హైకమిషన్ ఆండ్పూ ఫ్లైమింగ్ కేటీఆర్ కు స్వాగతం చెప్పారు. పలువురు ఎన్నారైలు ఆయన్ను కలుసుకున్నారు. లండన్ లో జరిగిన ఇన్వెస్ట్ మీటింగ్ కు కేటీఆర్ హాజరయ్యారు. పలు సంస్థల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. మౌలిక వసతుల కల్పనలో ముందున్న.. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇక ఏపీ సీఎం జగన్.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ లో దాదాపు 30 సమావేశాలు జరపనున్నారని తెలుస్తోంది. ఏపీ సీఎం టీమ్ లో పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తో పాటు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీనియర్ అధికారులు ఉన్నారు. దావోస్ లో సీఎం జగన్, మంత్రి కేటీఆర్ లు కలుసుకుంటారా.. వాళ్లిద్దరు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.


READ ALSO: PM Modi To Visit Hyderabad: మే 26న తెలంగాణకు ప్రధాని మోదీ.. ఫుల్ జోష్‌‌లో బీజేపీ శ్రేణులు


READ ALSO: UK Pharmaceutical Firm: తెలంగాణలో మరో అంతర్జాతీయ ఫార్మా సంస్థ పెట్టుబడులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook