CM Jagan on 2024 Elections: తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన వైసీపీ వర్క్‌ షాప్‌ జరిగింది. ఈసందర్భంగా పార్టీ నేతలు,కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా క్షేత్రంలోకి మరింత వెళ్లాలని నేతకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గెలవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అదే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని..అది కష్టం కాదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుప్పం మున్సిపాలిటీలో గెలుస్తామనుకున్నామా..స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్‌ చేస్తామనుకున్నామా..కష్ట పడితే సాధించలేనిది ఏమి లేదని చెప్పారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచామని ఈసందర్భంగా సీఎం జగన్ అన్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలన్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు.


ప్రతి సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమం కొనసాగేలా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో నెలకు ఒకసారి వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతంపై మంతనాలు జరుపుతామన్నారు సీఎం జగన్. వర్క్ షాపుల్లో ప్రజాప్రతినిధులు, నేతలు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటామని చెప్పారు. వాటిపై చర్చించి..ఓ నిర్ణయానికి వస్తామని నేతలకు మార్గనిర్దేశం చేశారు. మూడేళ్ల పాలనలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ ఆ ఫలాలు ఆగలేదని..ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.


Also read:  Virat Kohli Record: విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత.. ఏకైక క్రికెటర్‌గా రేర్ రికార్డు!


Also read:TS High Court: కరోనా పరీక్షలను పెంచండి..తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి