Ugadi Panchangam 2021: జగన్, కేసీఆర్ జాతకాలు సూపర్..మరి కష్టాలెదురయ్యే ఆ పెద్ద నేత ఎవరు
Ugadi Panchangam 2021: ఉగాది నాడు జాతకం చెప్పించుకోవడం ఓ ఆనవాయితీ. అందుకే ఉాగాది నాడు పంచాంగ శ్రవణం క్రమం తప్పకుండా ఉంటుంది. ఆ స్వామీజీ చెప్పిందాని ప్రకారం కేసీఆర్, వైఎస్ జగన్‌లకు చాలా బాగుంటుంది కానీ ఆ నేతకు మాత్రం కష్టాలేనట. ఇంతకీ ఎవరా నేత..
Ugadi Panchangam 2021: ఉగాది నాడు జాతకం చెప్పించుకోవడం ఓ ఆనవాయితీ. అందుకే ఉాగాది నాడు పంచాంగ శ్రవణం క్రమం తప్పకుండా ఉంటుంది. ఆ స్వామీజీ చెప్పిందాని ప్రకారం కేసీఆర్, వైఎస్ జగన్‌లకు చాలా బాగుంటుంది కానీ ఆ నేతకు మాత్రం కష్టాలేనట. ఇంతకీ ఎవరా నేత..
శ్రీ ప్లవ నామ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాగుంటుందట. విశాఖ శ్రీ శారదా పీఠం ( Visakha sarada peetham) ఆధ్వర్యంలో గంటల పంచాంగాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి సయుక్తంగా ఆవిష్కరించారు. ప్లవ అంటే చీకటని పాలదోలి వెలుగులు నింపేదని..ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలోని శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు శుభం కలగాలని కోరుకుందామన్నారు. గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోయినా రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌ల జాతకాలు (Kcr and Jagan Astrology) చాలా బాగున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగుతాయాని జోస్యం చెప్పారు.
అయితే రాజకీయంగా ఓ పెద్దనేతకు ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులుంటాయని జోస్యం చెప్పారు. ఆ నేత ఎవరనేదానిపై వివరణ ఇవ్వలేదు. స్వామీజీ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. స్వరూపానందేంద్ర స్వామి (Swarupanandendra swamy) చెప్పిన ఆ పెద్ద నేత ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది. నెటిజన్లు ఎవరికిష్టమైన పేరు వారు చెప్పుకుంటున్నారు. ఇంతకీ స్వామీజీ చెప్పిన ఆ పెద్ద నేత కేంద్రానికి చెందినవారా లేదా రాష్ట్రానికి చెందినవారా అనేది తేలాలన్నారు. కనీసం ఉత్తరాది వ్యక్తా లేదా దక్షిణాదికి చెందినవారా అనేది తెలిస్తే బాగుండేదని మరి కొందరంటున్నారు. చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) జాతకాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. స్వామీజి చెప్పిన ఆ పెద్దనేత ఈ ఇద్దరిలో ఒకరా అనే ప్రశ్న వస్తోంది.
Also read: Ugadi Prayers: ఉగాది ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook