Ugadi Prayers: ఉగాది ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Ugadi Prayers: తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన ఉగాది ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2021, 02:45 PM IST
 Ugadi Prayers: ఉగాది ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Ugadi Prayers: తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన ఉగాది ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు (Ugadi celebrations) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్‌ జగన్‌ సన్మానించారు.కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం ( Panchanga sravanam)నిర్వహించారు. సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ సమర్ధవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని..వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు.

మరోవైపు తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని సీఎం వైఎస్‌ జగన్‌( Ap cm ys jagan) ఆకాంక్షించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేద పండితులు పూజలు చేశారు.

Also read: Chandrababu Naidu: మందుబాబులు నాకే ఓటేయాలి: తిరుపతి ఉపఎన్నికలో చంద్రబాబు పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News