ఆగస్టు 22. వినాయక చవితి ( Ganesh Chaturthi ) ఓ వైపు..మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ( Megastar chiru birth day ). ఉదయం నుంచి సోషల్ మీడియా అంతా ప్రముఖులు , అభిమానుల విషెస్ తో నిండిపోయింది. ట్వీట్ల వర్షం కురుస్తోంది. తాజాగా  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా చిరంజీవికు శుభాకాంక్షలు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఉదయం నుంచి సోషల్ మీడియాలో ( Social media ) మెగాస్టార్ చిరుకు బర్త్ డే విషెస్ ( Birth day wishes ) భారీగా లభిస్తున్నాయి. ప్రముఖులంతా చిరంజీవికు ట్వీట్ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) చిరంజీవికి ట్వీట్ ద్వారా విషెస్ తెలిపారు. 


పద్మభూషణ్  చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Also read: Chiranjivi Birthday: సత్యదేవ్ విషెస్ చూస్తే హ్యాట్సాఫ్ అనక తప్పదు