Ys Jagan: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు, వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Ys Jagan: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్ని ఓదార్పుయాత్రలో పరామర్శించాను అంటూ భావోద్వేగంతో మాట్లాడారు వైఎస్ జగన్. బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు అందర్నీ హత్తుకున్నాయి.
Ys Jagan: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్ని ఓదార్పుయాత్రలో పరామర్శించాను అంటూ భావోద్వేగంతో మాట్లాడారు వైఎస్ జగన్. బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు అందర్నీ హత్తుకున్నాయి.
సంక్షేమమే ప్రాధాన్యతగా ఏపీ ప్రభుత్వం (Ap government)ప్రవేశపెట్టిన బడ్జెట్ అందర్నీ ఆకర్షిస్తోంది. సంక్షేమ పథకాలు, బీసీ సంక్షేమం, విద్యా వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. భావోద్వేగంతో చేసిన కొన్ని వ్యాఖ్యలు అందర్నీ హత్తుకున్నాయి. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని వైఎస్ జగన్ తెలిపారు. రెండేళ్ల హయాంలో ప్రతీ కుటుంబానికీ లబ్ది చేకూరేలా సంక్షేమ పాలన అందించామన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారికి ఏపీ అసెంబ్లీ (Ap Assembly)నివాళి అర్పిస్తోందన్నారు.
మహానేత కోసం ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఓదార్పుయాత్రలో పరామర్శించా..నాకు ప్రాణం విలువ బాగా తెలుసు. అందుకే ఆరోగ్య శ్రీలో విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చాం. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా మార్పులు చేశాం. ప్రతి 2 వేలమంది జనాభాకు ఒక ఏఎన్ఎంను ఏర్పాటు చేశాం అంటూ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. గత 14 నెలల కాలంలో కోవిడ్ నియంత్రణకు 2 వేల 229 కోట్లు ఖర్చు చేశామని వైఎస్ జగన్ (Ap cm ys jagan) తెలిపారు. కోవిడ్ రోగుల కోసం 47 వేల బెడ్స్ అందుబాటులో తెచ్చామని..కోవిడ్ కేర్ సెంటర్లలో 52 వేల బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. 18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో తెస్తున్నామని..కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
Also read: AP Budget Highlights: 2 లక్షల 29 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్, సంక్షేమానికి పెద్ద పీట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook