YS Jagan: ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లో మీడియాపై మండిపడ్డారు. ఎల్లో మీడియా రాస్తున్న తప్పుడు వార్తలపై ఆగ్రహం చెందారు. ఎల్లో మీడియాకు కనీస విలువలు లేవని విమర్శించారు.
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లో మీడియాపై మండిపడ్డారు. ఎల్లో మీడియా రాస్తున్న తప్పుడు వార్తలపై ఆగ్రహం చెందారు. ఎల్లో మీడియాకు కనీస విలువలు లేవని విమర్శించారు.
కరోనా మహమ్మారి నియంత్రణలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సత్ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావడం వల్లనే ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తుందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) మండిపడ్డారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహంచిన సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై వస్తున్న తప్పుడు కథనాలపై తీవ్రంగా స్పందించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే ఎల్లో మీడియా ఉద్దేశ్యమన్నారు.
ఆక్సిజన్ కొరతతో(Oxygen Shortage)రోగులు మరణిస్తున్నారంటూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 శాతానికి పైగా ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కనీస విలువలు పాటించకుండా ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చడమే ఈ ఎల్లో మీడియా ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. తప్పుడు కథనాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల్లో భయాందోళనలు రేపడమే ఎల్లో మీడియా లక్ష్యమన్నారు.
Also read: AP Covid Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 24 గంటల్లో 12 వేల కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook