Ap New Pension Scheme: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల రోడ్ మ్యాప్ అమల్లోకి వచ్చేసింది. కొత్త ఏడాదిలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ్తి నుంచి కొత్త పెన్షన్ 3 వేలు అవ్వాతాతల చేతికి అందనుంది. ఈ నెలలో మరి కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ తుది దశ ఇవాళ పూర్తయింది. నాడు 2 వేల రూపాయలున్న పెన్షన్‌ను దశలవారీగా పెంచుతూ 3 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రతియేటా 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. ఇవాళ్టి నుంచి కొత్త సంవత్సరం కానుకగా అవ్వాతాతలకు 3 వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నారు. ఈ నెల 8 వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. అధికారికంగా మాత్రం ఈనెల 3వ తేదీన కాకినాడలో జరిగే కార్యక్రమంతో ప్రారంభం కానుంది. ఇక ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 66.34 లక్షల మంది పెన్షనర్లకు 1968 కోట్ల రూపాయలు లబ్ది చేకూరనుంది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే సమయానికి పెన్షనర్ల సంఖ్య 39 లక్షలుంటే ఇప్పుడా సంఖ్య 66.34 లక్షలకు చేరుకుంది. 


మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కార్యక్రమం కూడా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అర్హత కలిగిన 1,17,161 మందికకి కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ నెల నుంచే కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడలో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. 


ఇక జనవరి 23 నుంచి నెలాఖరు వరకూ ఆసరా పధకంలో భాగంగా నాలుగో విడత నిధులు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో 78.94 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది. ఈ ఒక్క పధకానికే ప్రభుత్వం 25 వేల కోట్లు ఖర్చు పెడుతోంది. ఇక ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం నిర్వహించనున్నారు. 45 ఏండ్లు దాటిన మహిళలకు ఏడాదికి 18,750 రూపాయలు అందించే పధకం ఇది. 


Also read: APPSC Notifications: నిరుద్యోగులకు శుభవార్త, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల భర్తీకు నోటిఫికేషన్, ఎలా అప్లై చేయాలంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook