APPSC Notifications: నిరుద్యోగులకు శుభవార్త, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల భర్తీకు నోటిఫికేషన్, ఎలా అప్లై చేయాలంటే

APPSC Notifications: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వివిధ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీపీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 31, 2023, 08:57 AM IST
APPSC Notifications: నిరుద్యోగులకు శుభవార్త, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల భర్తీకు నోటిఫికేషన్, ఎలా అప్లై చేయాలంటే

APPSC Notifications: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఉన్న లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నుంచి రెండు నోటీఫికేషన్లు వెలువడ్డాయి. జూనియర్ లెక్చరర్ పోస్టులు 47, డిగ్రీ లెక్చరర్ పోస్టులు 240 భర్తీ కానున్నాయి. అర్హతలు, ఎలా అప్లై చేయాలి వంటి వివరాలు తెలుసుకుందాం..

జూనియర్ లెక్చర్ పోస్టుల భర్తీ ఇలా

ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీషులో 9, తెలుగులో 2, ఉర్దూ 2, సంస్కృతం 2, ఒరియా 1, గణితం 1, ఫిజిక్స్ 5, కెమిస్ట్రీ 3, బోటనీ 2, జువాలజీ 1, ఎకనామిక్స్ 12, సివిక్స్ 2 , హిస్టరీ 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత విభాగంలో  పీజీ కిలిగి ఉండాలి. వయస్సు 18-42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు ఎక్స్ సర్వీస్‌మెన్ లేదా ఎన్‌సీసీ అభ్యర్ధులకు 3 ఏళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, తాత్కాలిక ఉద్యోగులకు 3 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. 

రాత పరీక్ష, కంప్యూటర్ సామర్ధ్యం ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష ఉంటుంది. 

డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ ఇలా

రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో మొత్తం 240 లెక్చరర్ పోస్టుల భర్తీకు ఏపీపీఎస్సీ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. బోటనీలో 19, కెమిస్ట్రీలో 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 16, హిస్టరీ 19, మేథ్స్ 17, ఫిజిక్స్ 11, పాలిటిక్స్ 21, జువాలజీ 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించి వాటి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలను https://psc.ap.gov.in లో చూడవచ్చు. జనవరి 24 నుంచి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. 

ఈ పోస్టుల భర్తీకు ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్ల పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ స్డడీస్ 150 మార్కులకు, సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ 150 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానాలకు మైనస్ మార్కుల విధానం అమల్లో ఉంది. 

Also read: RGV Case: ఆర్జీవీ తలకు వెల కేసులో శ్రీనివాసరావు అరెస్టుకు రంగం సిద్ధం, విచారణకు రమ్మని నోటీసులు జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News