ఏపీ అసెంబ్లీలో రసవత్తర ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో టీడీపీ నేత చంద్రబాబు వైఖరిని ముఖ్యమంత్రి జగన్ పూర్తి వ్యంగ్య ధోరణిలో తిప్పికొట్టారు. చంద్రబాబును జగన్ విమర్శించిన తీరు ఇప్పుడు మీడియాలో హైలైట్‌గా నిలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ( Ap Assembly winter session ) ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభంలో బీఏసీ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి ( Tdp leader Atchannaidu ) పై సెటైరికల్ వ్యాఖ్యలతో ఆడుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్..అసెంబ్లీ ( Assembly ) లో కూడా అదే వైఖరి కొనసాగించారు. వ్యవసాయానికి సంబంధించిన బిల్లుల్ని ప్రవేశపెడుతున్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు వైఖరిని ఎండగట్టిన తీరు మీడియాలా హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆ బిట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 


చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu ) మధ్యలో కలగజేసుకుని..ఇతర సభ్యులతో కలిసి పోడియం వద్ద భీష్మించుకుకూర్చున్నారు. దాంతో సభ సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. ఈ వైఖరినే వైఎస్ జగన్ ( Ys jagan ) తప్పుబడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


వైఎస్ జగన్ వ్యంగ్య బాణాలివే..


చంద్రబాబు నాయుడు యాక్టరైతే..ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నాయని..ఇది రాష్ట్రంలో మీడియా పరిస్థితి, దుస్థితి అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. రైతుల్ని మరోరకంగా చూపించేందుకు ఒక డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈయనంతట ఈయనే ఎందుకు రెచ్చిపోయాడో తెలియదు..వాళ్ల పార్టీకు సంబంధించిన మనిషి..వాళ్ల మనిషే మాట్లాడుతున్నాడు కదా అని అన్నారు. 


రామానాయుడో..డ్రామానాయుడో మాట్లాడుతున్నాడు..దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. ఇచ్చిన తరువాత మళ్లీ రామానాయుడో డ్రామా నాయుడో మాట్లాడాలి కదా అని జగన్ గుర్తు చేశారు. అలా కాకుండా..నేను మాట్లాడతానంటూ సడెన్‌గా చంద్రబాబు లేచిపోవడం..ఎప్పుడు పడితే అప్పుడు లేచి మాట్లాడటం ఎక్కడా జరగదని ఆయనకు కూడా తెలుసన్నారు.  అయినా రెచ్చిపోవడం, చాలా ఆశ్చర్యకరమని..తాను ఐదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఎప్పుడూ పోడియంలో కూర్చోలేదన్నారు. 


40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు..ఈయనే వచ్చేయడం..పోడియంలో కూర్చోవడం..అందర్నీ తొక్కేసి కూర్చోవడం..ఈ పద్ధతేంటని ప్రశ్నించారు.  ఆ తరువాత ఈ తతంగాన్ని ఈనాడు వాడో..ఆంధ్రజ్యోతి వాడో..టీవీ5 వాడో స్క్రీన్ ప్లే ప్రకారం ఎత్తుకుంటాడని వ్యాఖ్యానించారు జగన్. Also read: AP: అచ్చెన్నాయుడిపై వైఎస్ జగన్ సెటైర్ మాములుగా లేదుగా..