Good news for Teachers: బదిలీలకు గ్రీన్ సిగ్నల్, రెండ్రోజుల్లో ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త అందించారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో రెండు మూడ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) శుభవార్త అందించారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో రెండు మూడ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించిన వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మలిచేందుకు నాడు నేడు పథకానికి ( Nadu-nedu program) శ్రీకారం చుట్టి..సమూల మార్పులు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ ప్రారంభయ్యే నాటికి వాటిలో మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే జగనన్న విద్యాకానుకను ప్రవేశపెట్టి.. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలతో పాటు బ్యాగులు వంటి వాటిని అందించారు.
లాక్ డౌన్ ( Lockdown ) అనంతరం స్కూళ్లను తిరిగ తెరిచే అంశాన్ని కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయడంతో..నవంబర్ తొలివారంలో పాఠశాలలను ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ( Ap Government ) సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ అందించారు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం. టీచర్ల బదిలీ ( Teachers Transfers ) లకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. టీచర్ల బదిలీలపై మరో మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ నిర్ణయంతో మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న టీచర్ల నిరీక్షణకు తెరపడనుంది. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదీలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. Also read: AP High court: ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు?