Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వైద్య రంగాల్ని బలోపేతం చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కరోనా మహమ్మారి వేధిస్తున్న వేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాల్ని కల్పిస్తోంది. ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ..తదనుగుణంగా చర్యలు తీసుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో వైఎస్ జగన్ (Ap cm ys jagan) ముఖ్యమంత్రిగా బాథ్యతలు స్వీకరించినప్పటి నుంచీ విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. నాడు - నేడు (Naadu-Nedu) ద్వారా విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మల్చుతున్నారు. అదే సమయంలో వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ..ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య రంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరముంది. 


ఈ నేపధ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government Hospitals) సిటీస్కాన్,ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లను (City and MRI Machines) ప్రవేశపెట్టారు. నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చ్యువల్‌గా ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రుల్ని మరింతగా బలోపేతం చేస్తున్నామని వైఎస్ జగన్ తెలిపారు.పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని..మరో 16 టీచింగ్ ఆసుపత్రుల్ని అందుబాటులో తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ అన్ని ఆసుపత్రుల్ని ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొస్తామన్నారు.


Also read: Cyclone Alert: వారం రోజుల్లో బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook