AP: అత్యవసర వాహనాల్ని ప్రారంభించిన సీఎం జగన్
విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ముంబై తరువాత ఇటువంటి వాహనాలున్నది ఏపీలోనే ఉండటం గమనార్హం..
విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ముంబై తరువాత ఇటువంటి వాహనాలున్నది ఏపీలోనే ఉండటం గమనార్హం..
ఎక్కడైనా అగ్నిప్రమాదం కానీ..ప్రకృతి విపత్తు గానీ తలెత్తితే అత్యవరసర సేవలకు ( Emergency services ) వీలుగా 14 వాహనాల్ని ప్రభుత్వం సమకూర్చుకుంది. అటు పోలీసు అత్యవసర సేవల ( Police emergency services ) కోసం మరో 36 వాహనాలను అందించింది ప్రభుత్వం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) వీటిని ప్రారంభించారు. ఏ విపత్తు జరిగినా అన్ని సదుపాయాలు, ఎక్విప్‌మెంట్‌తో పాటు 20 మంది ఎస్టీఆర్ఎఫ్ టీమ్ వెళ్లేలా ఈ వాహనాలుంటాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్‌కి ఇవి కనెక్ట్ అవుతాయి. ఈ కెెమేరాల ద్వారా ఫీల్డ్‌లో పరిస్థితి ఏంటనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
పోలీసు అత్యవసర సేవల వాహనాల్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Ap Dgp Gautam sawang ) పరిశీలించారు. హై టెక్నాలజీ, సామర్ధ్యం ఈ వాహనాల్లో ఉందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. పడవ, రోడ్డ ప్రమాదాలు తలెత్తినా..ఫైర్ యాక్సిడెంట్లు, భవననాలు కూలినప్పుడు ఈ తరహా వాహనాలు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. ముంబై తరువాత దేశంలో ఈ తరహా వాహనాలు ఏపీలోనే ఉన్నాయన్నారు.
Also read: SSC Exams 2021 updates: 10వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ అప్‌డేట్స్