Ap cm ys jagan: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం పరిపాలకు సిద్ధమౌతోంది. ముందుగా అనుకున్నట్టు దసరాకు కాకుండా డిసెంబర్ నాటికి విశాఖకు షిఫ్టింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎంవో విశాఖకు తరలింపు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీసు పనులు ఇంకా కొనసాగుతుండటం, ఇతర శాఖల ఆఫీసులు వంటి కారణాలతో తరలింపు ప్రక్రియ దసరాకు జరగడం లేదు. ఇవాళ విశాఖపట్నంలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న వైఎస్ జగన్ మాట్లాడారు. మధురవాడలోని ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. అనంతరం పరవాడ, అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలను ప్రారంభించారు. విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమని, చాలా మౌళిక సదుపాయులు ఆందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు తరహాలో విశాఖపట్నం త్వరలో ఐటీ హబ్ కానుందని చెప్పారు. 


విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని మరో రెండేళ్లలో కేవలం సివిలియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సిద్ధం కానుందని తెలిపారు. త్వరలో విశాఖ నుంచి మొత్తం పరిపాలన ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వాస్తవానికి అక్టోబర్‌కే రావాలనుకున్నా కొద్దిగా ఆలస్యమౌతోందని చెప్పారు. డిసెంబర్ నాటికి విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతానని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కావల్సిన అన్ని రకాల మౌళిక వసతులు కల్పిస్తామన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఎలాంటి మౌళిక సదుపాయాలు కావాలన్నా కల్పిస్తామని చెప్పారు. 


Also read: Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook