AP CM Ys Jagan: ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసిన జగన్ భేటీ, పలు అంశాలపై చర్చ
AP CM Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం ముగిసింది. దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకొచ్చాయి. ఆ వివరాలు ఇవీ.
AP CM Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం ముగిసింది. దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకొచ్చాయి. ఆ వివరాలు ఇవీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, జిల్లాల విభజన, పోలవరం ప్రాజెక్టు నిధులు వంటి అంశాలు ఇరువురి మద్య చర్చకొచ్చాయి. ప్రధానంగా రాష్ట్రానికి రావల్సిన నిధుల గురించి వైఎస్ జగన్ వివరించినట్టు సమాచారం. రాష్ట్రంలోని రాజకీయాలు కూడా ఇరువురి మధ్య చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన నిర్ణయమైన మూడు రాజధానులకు సహకరించాలని వైఎస్ జగన్ కోరినట్టు సమాచారం. పోలవరం పెండింగ్ నిధులు త్వరగా విడుదల చేయించాలని జగన్ కోరారు. రాత్రికి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నారు.
Also read: AP New Districts: కొత్త జిల్లాలు, మూడు రాజధానులపై ఇవాళ మోదీతో ఏపీ సీఎం భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook