హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణకు వచ్చారు. వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా సీబీఐ కోర్టులో హాజరయ్యారు. పది గంటలకు బేగంపేట చేరుకున్న వైఎస్ జగన్... దాదాపు 10.30 గంటల సమయంలో సీబీఐ కోర్టులో హాజరయ్యారు. నేటి మధ్యాహ్నం 2 గంటలవరకు విచారణ కొనసాగుతుంది. కాగా, సీఎం హోదాలో సీబీఐ స్పెషల్ కోర్టుకు వైఎస్ జగన్ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం హోదాలో కోర్టుకు హాజరయ్యేందుకు భద్రతా కారణాలు, భారీగా ఖర్చుల నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టును జగన్ అభ్యర్థించారు. అయితే జగన్ అభ్యర్థనను మన్నించని కోర్టు విచారణకు నేరుగా హాజరు కాల్సిందేనని స్పష్టం చేయగా ఏపీ సీఎం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.


మధ్యాహ్నం 2.20కి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం తిరుగుప్రయాణం కానున్నట్లు సమాచారం. కాగా, 2012లో ఉమ్మడి ఏపీలో వరంగల్ ఎన్నికల సందర్భంగా అనుమతి లేకుండా సభ నిర్వహించిన కేసులో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కూతురు షర్మిల సైతం నేడు హైదరాబాద్ లోని ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు కోర్టు ఇటీవల వీరిద్దరితో పాటు కేసులో ప్రమేయం ఉన్న మరికొందరికి సమన్లు జారీ చేసిన విషయం విదితమే.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..