AP CM YS Jagan letter to Smriti Irani: ఏపీలో మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, వారి రక్షణ కోసం దిశ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ దిశ యాప్‌ను మహిళా పోలీసులు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ఆడవారికి అవగాహన కల్పించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిశ ప్రాజెక్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ఆమోదించాలని లేఖ ద్వారా స్మృతి ఇరానీని కోరారు. మహిళలకు రక్షణ కల్పించే దిశ బిల్లును త్వరగా ఆమోదం జరిగే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమీక్షలో భాగంగా దిశ కాల్‌ సెంటర్లలో అదనపు సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు దిశ మొబైల్ యాప్‌ (Disha App)ను విద్యార్థినులు, యువతులు, మహిళలు కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీ సీఎం సూచించారు.


Also Read: Disha App: దిశ యాప్ ఎలా పని చేస్తుంది, ప్రయోజనాలేంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి


కాగా, ఏపీలో ఇదివరకే 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు దిశ చట్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే సత్వరమే చట్టం అమలులోకి వచ్చి, ఏపీలో మహిళల భద్రతకు భరోసా పెరుగుతుందని ఏపీ సర్కారు భావిస్తోంది. దిశ యాప్‌నకు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని ఏపీ సీఎం జగన్‌ (AP CM YS Jagan Mohan Reddy) ఇటీవల పేర్కొన్నారు. ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రంగా దిశ యాప్‌ను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదివరకే భారీ సంఖ్యలో డౌన్‌లోడ్స్ జరిగినట్లు సమాచారం.


Also Read: Disha App Campaign: మహిళల రక్షణలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు : వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook