Naga Chaitanya - Sobhita: మీరు ప్రశంసించడం మా అదృష్టం... మోదీకి ధన్యవాదాలు తెలిపిన నాగ చైతన్య దంపతులు..

Naga chaitanya insta post: చైతు, శోభిత దంపతులు దేశ ప్రధాని మోదీకి థైంక్స్ చెబుతూ ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 30, 2024, 12:00 PM IST
  • మోదీకి ధన్యవాదాలు తెలిపిన చైతు కపుల్..
  • తమకు ఎంతో ఆనందంగా ఉందంటూ పోస్ట్..
Naga Chaitanya - Sobhita: మీరు ప్రశంసించడం మా అదృష్టం... మోదీకి ధన్యవాదాలు  తెలిపిన నాగ చైతన్య దంపతులు..

sobhita dhulipala post on pm modi: భారత దేశ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పలువురు దిగ్గజాలను గుర్తు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి వారు చేసిన సేవలను మరోసారి ప్రశంసించారు. ఈ రోజున సినిమా రంగంలో ఒక వెలుగు వెలగడానికి నాడు.. వారు చేసిన తపన, పట్టుదల,విలువలే ఈ తరం వాళ్లకు మార్గదర్శకాలు అయ్యాయని మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఏయన్నార్, బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా, రాజ్ కపూర్ ల సిని ప్రస్థానంగురించి మాట్లాడుతూ.. ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

ఏయన్నార్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారన్నారు. అదే విధంగా.. తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త పుంతలో తొక్కేలా చేశాయన్నారు. రాజ్ కపూర్ తన మూవీస్ తో.. ఎన్నొ కొత్త అంశాల్ని సినిమా రూపంలో ప్రజల ముందు ఉంచారని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ.. ఏయన్నార్ ను గుర్తుచేసుకొవడం, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన సేవల్ని మరొసారి మన్ కీ బాత్ లో మాట్లాడటం పై.. కింగ్ నాగార్జున ఇప్పటికే తన ఇన్ స్టా వేదికగా స్పందించారు.మోదీగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు.

అదే విధంగా తాజాగా.. చైతు, శోభిత దంపతులు సైతం.. దేశ ప్రధాని మోదీజీ ఇలా ప్రశంసించడం ఎంతో ఆనందంగా ఉందని.. ఇది తమకు దక్కిన  అదృష్టంగా భావిస్తున్నట్లు చైతు, శోభిత ఇన్ స్టాలో పోస్ట్ పెట్టినట్లు తెలుస్తొంది.  ఏయన్నార్ విజన్.. భావితరాలకు స్పూర్తిదాయకమన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దీనిపైన కొంత మంది మాత్రం వెరైటీగా స్పందిస్తున్నారు.

Read more: Sai Pallavi: నా జీవితంలో ఇలాంటి పీలింగ్స్ లేవు..!.. చెల్లి పెళ్లిపై ఎమోషనల్ అయిన సాయి పల్లవి..

తెలంగాణలో రేవంత్ ఇప్పటికే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. అదే విధంగా తన కుటుంబం పరువు పోయే విధంగా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన  కూడా రేవంత్ ఎక్కడ కూడా సీరియస్ గా స్పందించినట్లు లేదు. ఈ నేపథ్యంలో ఏకంగా మోదీజీ ఈ సమయంలో అక్కినేని కుటుంబాన్ని ప్రశంసిచడం మాత్రం ఇండస్ట్రీలోను, రాజకీయంగాను కూడా జోరుగా చర్చ జరుగుతుందంట. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News