Happy New Year: రండి బాబు రండి.. తాగినోళ్లకు తాగినంత మందు.. మద్యం ప్రియులకు న్యూ ఇయర్ కిక్

Liquor Sales Timings in Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 నైట్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌లో పబ్‌లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వివిధ ఆఫర్లు ప్రకటించారు. న్యూ ఇయర్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
 

1 /7

రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని పోలీసులు కీలక ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో 4 పబ్బులకు అనుమతి ఇవ్వలేదు. హాట్కప్, అమినేషియా, బ్రాండ్వే, బేబీ లాండ్ పబ్బుల్లో అనుమతి రద్దు చేశారు.  

2 /7

ఇక కేవలం 10 గంటల వరకు మాత్రమే డీజేకు అనుమతి ఇవ్వగా.. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు ఓపెన్‌లో ఉండనున్నాయి.  

3 /7

మందుబాబులకు తాగినోళ్లకు తాగినంత మందును అమ్మేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా క్లబ్‌లు, పబ్‌లకు భారీగా మద్యాన్ని తరలించారు.  

4 /7

డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా రూ.వెయ్యి కోట్లు ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.  

5 /7

డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా రూ.వెయ్యి కోట్లు ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.  

6 /7

ప్రతి జిల్లా.. ప్రతి డివిజన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలు సడలించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతోంది.  

7 /7

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మొత్తం ప్రభుత్వానికి రూ.1500 కోట్ల ఆదాయం తగ్గకుండా ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.