AP: మూడు రాజధానుల దిశగా జగన్ అడుగులు..అమిత్ షాతో భేటీ మర్మమిదే..
ఏపీ మూడు రాజధానుల అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైెఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఇదే కారణంగా తెలుస్తోంది. అమిత్ షాతో జరిగిన భేటీలో మూడు రాజధానుల అంశమే నడిచిందని సమాచారం.
ఏపీ మూడు రాజధానుల అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైెఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఇదే కారణంగా తెలుస్తోంది. అమిత్ షాతో జరిగిన భేటీలో మూడు రాజధానుల అంశమే నడిచిందని సమాచారం..
ఏపీలో మూడు రాజధానుల (Ap three capital issue ) అంశం మరోసారి తెరపైకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఢిల్లీ ఆకస్మిక పర్యటనకు కారణాలేంటనే కోణంలో రకరకాల చర్చలు సాగాయి. మూడు రాజధానుల అంశమే పర్యటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధికార వికేంద్రీకరణలో భాగంగా ఏపీ త్రీ కేపిటల్ ప్రతిపాదనకు కేంద్రమద్దతు కోరారు జగన్. దాదాపు గంట సేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ( Central minister Amit shah ) సమావేశమైన జగన్..పలు కీలకాంశాలపై చర్చించారు.
ముఖ్యంగా న్యాయ రాజధానిగా ( Ap judicial capital kurnool ) ప్రతిపాదించిన కర్నూలులో హైకోర్టు ( High court ) ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఈ మేరకు కేంద్రం ( Central government ) నోటిఫికేషన్ జారీ చేయాలని అమిత్ షాను విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల అంశం మరోసారి చర్చనీయాంశమవడంతో తొలిసారిగా ఈ అంశంపై కేంద్ర మద్దతు కోరారు వైెఎస్ జగన్. ఇందులో భాగంగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన రీ లొకేషన్ నోటిఫికేషన్ జారీ చేయాలని అడిగారు. మూడు రాజధానుల ప్రతిపాదన అవసరం, శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఎంపిక వెనుక కారణాల్ని హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ జగన్ వివరించారు.
Also read: Andhra Pradesh: లారీని ఢికొన్న బైక్.. ముగ్గురు యువకుల మృతి
రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని..రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనంటూ కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లను ఈ సందర్బంగా వైఎస్ జగన్ ప్రస్తావించారని తెలుస్తోంది. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా హైకోర్టుపై నోటిఫికేషన్ ఇస్తే..పనులు త్వరగా ప్రారంభిస్తామన్నారు జగన్.
మరోవైపు పోలవరం ( Polavaram project )పై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్..అమిత్ షాతో చర్చించారు. పోలవరంపై సవరించిన 55 వేల 656 కోట్ల అంచనాల్ని ఆమోదించాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావల్సిన 15 వేల కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలయాపన జరిగేకొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిపోతుందని గుర్తు చేశారు. Also read: AP: మీరు విచారణ నుంచి తప్పుకోండి: హైకోర్టులో ప్రభుత్వ అఫిడవిట్