Jagananna Chedodu: జగనన్న చేదోడు డబ్బులొచ్చేశాయి, మీ ఎక్కౌంట్లో చెక్ చేసుకోండి
Jagananna Chedodu: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో మరో పథకమైన చేదోడు పథకం డబ్బులు జమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా అర్హులైన లబ్దిదారులకు 10 వేల చొప్పున సహాయం అందింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా చేదోడు పథకం కింద అర్హులకు డబ్బులు ఎక్కౌంట్లో జమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.30 లక్షలమందికి 10 వేల రూపాయల చొప్పున..330.15 కోట్లను వైఎస్ జగన్ జమ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీ ప్రభుత్వం జగనన్న చేదోడు పథకంలో భాగంగా మూడవ విడత సహాయాన్ని అందించారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన బహిరంగ సభలో మొత్తం 330 కోట్లు విడుదలయ్యాయి. గత మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం 927.39 కోట్లను ఈ పథకం కింద విడుదల చేసింది. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి వర్గానికి మేలుచేసేలా ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం 10 వేల రూపాయల చొప్పున గత మూడేళ్లుగా అందిస్తోందని జగన్ చెప్పారు. ఇందులో భాగంగానే ఇవాళ 3.30 లక్షలమందికి లబ్ది చేకూర్చామన్నారు.
నవరత్నాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతోందని వైఎస్ జగన్ చెప్పారు. లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్ధిక సహాయాన్ని వివక్ష లేకుండా అందిస్తున్నామన్నారు. దేశంలోనే జీడీపీ ప్రకారం ఏపీ గ్రోత్ రేట్ 11.43 శాతంతో మొదటి స్థానంలో ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అన్నివర్గాలు అభివృద్ధి సాధించినప్పుడే ఇలాంటి ఫలితం సాధ్యమౌతుందన్నారు. సీఎంగా గతంలో ఓ ముసలాయన ఉండేవారని..గజదొంగలా ముఠా ఉండేదని..ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ఆలోచించలేదని చంద్రబాబుని ఉద్దేశించి విమర్శలు చేశారు జగన్.
తోడేళ్లు ఒక్కటవుతున్నా..మీ బిడ్డకు భయం లేదని..ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని మాత్రమే నమ్ముకున్నాడని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దోపిడీ పాలన కావాలో, లంచం, అవినీతి లేని పాలన కావాలో ప్రజలే జాగ్రత్తగా ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లని దీవెనలున్నాయనేదే మీ బిడ్డకు ఉన్న ఒకే ఒక నమ్మకమన్నారు వైఎస్ జగన్.
Also read: Jagananna Chedodu Scheme: జగన్ సర్కారు గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్‌లో రూ.10 వేలు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook