Jagananna Chedodu Scheme: జగన్ సర్కారు గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్‌లో రూ.10 వేలు జమ

CM Jagan Mohan Reddy On Jagananna Chedodu: జగనన్న చేదోడు పథకం 3వ విడత సాయం సోమవారం లబ్ధిదారుల ఖాతాలో జమకానుంది. పల్నాడు జిల్లా  వినుకొండలో సీఎం జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. కుల వృత్తులకు చెందిన వారు పెట్టుబడి కోసం జగనన్న చేదోడు పథకం కింద ప్రతి సంవత్సరం రూ.10 వేల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 07:07 PM IST
Jagananna Chedodu Scheme: జగన్ సర్కారు గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్‌లో రూ.10 వేలు జమ

CM Jagan Mohan Reddy On Jagananna Chedodu: జగన్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. జగనన్న చేదోడు పథకం 3వ విడత సాయాన్ని ప్రభుత్వం  లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో సీఎం జగన్ డబ్బులు జమ చేయనున్నారు. అయితే దరఖాస్తులకు గడువు మూడు రోజులే గడువు ఇవ్వడంపై కొందరు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పాత లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు క్యాస్ట్, ఇన్‌కమ్, లేబర్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు ఈ నెల 26 వరకే ప్రభుత్వం గడువు ఇచ్చింది.  అయితే 26న సెలవు కావడంతో చాలా మంది లబ్ధిదారులు సర్పించలేకపోయారు. దరఖాస్తు సమయం ముగియడంతో ప్రభుత్వ సాయం తమకు అందడం లేదని కొందరు లబ్ధిదారులు వాపోతున్నారు. కుల వృత్తులకు చెందిన వారు పెట్టుబడి కోసం జగనన్న చేదోడు పథకం కింద ప్రతి సంవత్సరం రూ.10 వేల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులు జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించారు. గతేడాది అర్హులై ఉండి డబ్బులు రాని వారికి ఈసారి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పథకం పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉండి.. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. రజక, నాయీ బ్రాహ్మణ, టైలరింగ్ వృత్తి చేస్తున్నవారై ఉండాలి. రేపు అందిస్తున్న సాయంతో కలిపి ఈ మూడేళ్లలో కేవలం ఈ పథకం ద్వారా జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.927.39 కోట్లు

సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయలురేరుతారు. ఉదయం 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. అనంతరం ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 12.20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ వేదికపైనే జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు నగదు జమ చేస్తారు. సభ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు వినుకొండ నుంచి బయల్దేరి.. 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్.
      
జగనన్న చేదోడు పథకం కింద ఇప్పటివరకు అందించిన లబ్ధి

2020–21లో లబ్ధిదారుల సంఖ్య 2,98,122 సాయం రూ. 298.12 కోట్లు
2021–22లో లబ్ధిదారుల సంఖ్య 2,99,116 సాయం రూ. 299.12 కోట్లు
2022–23లో లబ్ధిదారుల సంఖ్య 3,30,145 సాయం రూ. 330.15 కోట్లు

Also Read: Nandamuri Tarakaratna: నా గుండె పగిలిపోయింది.. తారకరత్న ఆరోగ్యంపై నారా లోకేష్ ఎమోషనల్   

Also Read: Novak Djokovic: చరిత్ర సృష్టించిన నొవాక్ జోకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఫైనల్లో విక్టరీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News