YCP Election Manifesto: ఏపీ ఎన్నికలకు వైసీపీ ఇప్పుడు అన్ని విధాలుగా సిద్ధమైంది. పార్టీ మేనిఫెస్టో సైతం విడుదల కావడంతో ఇక ప్రజల్లోకి హామీల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయనుంది. 2019లో ఇచ్చిన నవరత్నాలు హామీల్ని కొనసాగిస్తూనే కొన్ని విస్తరించనుంది. చెప్పింది చేస్తామని, చేయగలిగిందే మేనిఫెస్టోలో రూపొందించామని వైఎస్ జగన్ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, రైతు భరోసా నగదు మొత్తం పెంచుతున్నట్టు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. ముఖ్యంగా 9 హామీలతో కూడిన మేనిఫెస్టోను స్వయంగా జగన్ చదివి విన్పించారు. వృద్ధాప్య పెన్షన్ కూడా స్వల్పంగా పెంచనుంది. 


వృద్ధాప్య పెన్షన్‌ను రెండు విడతల్లో 3 వేల నుంచి 3500 రూపాయలకు పెంచనుంది. అమ్మ ఒడి పధకం మరో రెండు వేలు పెంపు. వైఎస్సార్ చేయూత పధకాన్ని నాలుగు విడతల్లో ప్రస్తుతం ఇస్తున్న 75 వేలను 1 లక్షా 50 వేలు చేయనుంది. వైఎస్సార్ కాపు నేస్తం పధకాన్ని నాలుగు విడతల్లో 60 వేల నుంచి 1 లక్షా 20 వేలకు పెంపు. ఇక ఈబీసీ నేస్తం పధకంలో భాగంగా ఇచ్చే నగదు నాలుగు విడతల్లో 45 వేల నుంచి 1 లక్షా 5 వేలకు పెంపు.


వైఎస్సార్ రైతు భరోసా కింద ఇస్తున్న నగదును 13,500 రూపాయల్నిచి 16 వేలకు పెంపు, కౌలు రైతులకు సైతం వర్తింపు. మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో 50 వేలు ఇచ్చే హామీ. వైఎస్సార్ సున్నా వడ్జీ కింద 3 లక్షల రుణం. ట్యాక్సీ కొనుగోలుపై వడ్డీ రాయితీ,  వాహనమిత్రను ఐదేళ్లలో 50 వేల నుంచి 1 లక్షకు పెంపు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు సైతం వాహన మిత్ర వర్తింపు, పది లక్షల భీమా సౌకర్యం హామీ. చేనేత కార్మికులకు ఏడాదికి 24 వేల చొప్పున ఐదేళ్లలో 1 లక్షా 20 వేలు. 2025 నుంచి 1వ తరగతి నుంచే ఐబీ సిలబస్. తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ. 


అధికారంలో రాగానే విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అదే మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌లా విశాఖపట్నంను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టులను రానున్న ఐదేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 


Also read: YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook