Ys Jagan Review: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య ఆరోగ్యశాఖపై కీలకమైన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ , మెడికల్ కళాశాలల నిర్మాణంపై చర్చించారు. విలేజ్ క్లినిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కోవిడ్ 19(Covid19)నివారణ-నియంత్రణ, వ్యాక్సినేషన్, హెల్త్‌హబ్స్, కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలల ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త మెడికల్ కళాశాలల విషయంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, నాడు-నేడు పనులు, 104 వాహనాలు కొనుగోలు అంశాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా విలేజ్ క్లినిక్స్‌పై(Village Clinics)ప్రత్యేక దృష్టి సారించాలని ప్రత్యేకంగా అధికారులను కోరారు. పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా వైద్యులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య మిత్రల నెంబర్లు సచివాలయంలోని హోర్డింగ్స్‌లో ఉండాలన్నారు. హెల్త్ కార్డుల్లో ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాల్ని క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశముండాలని వైఎస్ జగన్ తెలిపారు. ఆ వ్యక్తికి సంబంధించిన పరీక్షలు, ఫలితాలు, చికిత్స, మందులు అన్నింటినీ డేటాలో భద్రపర్చాలన్నారు. డిజిటల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ హెల్త్ ఐడీలు క్రియేట్ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. 


రాష్ట్రంలో ఇప్పటి వరకూ సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య 1 కోటి 38 లక్షల 32 వేలు కాగా, రెండు డోసులు పూర్తయినవారి సంఖ్య 1 కోటి 44 లక్షల 94 వేలుగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 83 లక్షల 27 వేల మంది వ్యాక్సిన్ (Covid Vaccine)తీసుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 9 వేల 141 ఉన్నాయి. కరోనా వైరస్ పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 1.62 శాతంగా ఉంది. అటు రికవరీ రేటు 98.86గా ఉంది. కరోనా థర్డ్‌వేవ్‌కు రాష్ట్రం సన్నద్ధంగా ఉందన్నారు అధికారులు. రాష్ట్రంలో 20 వేల 964 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు(Oxygen Concentrators) అందుబాటులో ఉన్నాయని..ఇంకా 2 వేల 493 కాన్సెంట్రేటర్లు రావల్సి ఉన్నాయన్నారు.  రాష్ట్రంలో 140 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు నిర్మాణంలో ఉండగా..అక్టోబర్ నాటికి పూర్తి కానున్నాయి. 


Also read: AP RGUKT CET Results: ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల...చెక్ చేసుకోండి ఇలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook