AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌళిక సదుపాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షలో ఈ అంశానికి ఆమోదం తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల అవతరణ, మౌళిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సదుపాయాలపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9 గంటల్నించి 9 గంటల 45 నిమిషాలకు కొత్త జిల్లాల అవతరణ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఏప్రిల్ 6వ తేదీన వాలంటీర్ల సత్కారం, ఏప్రిల్ 8వ తేదీన దీవెన కార్యక్రమాలుంటాయని వెల్లడించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, జీఏడీ ఛీప్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. 


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాల్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రజల్నించి 16 వేల 6 వందల అభ్యంతరాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశామన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులతో చర్చించిన తరువాతే..కలెక్టర్ల సిపార్సులు చేశామన్నారు. సిబ్బంది విభజన, పోస్టింగులో సిక్స్ పాయింట్ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులన్నింటినీ పరిగణలో తీసుకున్నామన్నారు. వీటి ప్రకారమే..కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 


కొత్త జిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా..అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించామన్నారు. కొత్త జిల్లాల కోసం కొత్త వెబ్‌సైట్స్, కొత్త యంత్రాగం ఏర్పాటు నేపధ్యంలో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశామన్నారు. కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్‌బుక్స్ రూపొందించామన్నారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాల్ని ఖరారు చేశామన్నారు. సుస్ధిర ఆర్ధిక ప్రగతికై నిర్దేశించుకున్న లక్ష్యాల్ని కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కనీసం 15 ఎకరాల స్థలం ఉండాలన్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలన్నారు. 


Also read: 26 Districts in AP: 26 జిల్లాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర.. ఏప్రిల్ 4 న కొత్త జిల్లాల అవతరణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook