PRC Review: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడనుంది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్దిరోజులుగా సమ్మెబాట పట్టారు. వేతన సవరణ(PRC)టి కొన్ని డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగ 13 లక్షలమంది ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం కోరింది. 11వ పీఆర్సీ అమలు చేయాలనేదే ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఇప్పటి వరకూ 7 డీఏలు పెండింగ్‌లో ఉంచారన్నారు. వీటితో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ వంటి ఇతర డిమాండ్లు ఉన్నాయన్నారు. తక్షణం ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం కానుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. 


ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. కమిటీ సిఫార్సులు పరిశీలించి ఏమేరకు వేతనాలు పెంచాలో సమీక్షిస్తున్నారు. మరోవైపు సీపీఎస్ రద్దు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసుల్ని శాశ్వతం చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించడం వంటి డిమాండ్ల కారణంగా ప్రభుత్వంపై అదనంగా ఎంత భారం పడుతుందనేది పరిశీలిస్తున్నారు. 


Also read: Helicopter Crash: చిట్టితల్లిని చూడాలనుంది..వీలు కుదిరితే సాయంత్రం చేస్తాను


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook