ప్రజలకు సొంతంగా ఇంటి స్థలం, సొంతింటి కల విషయమై..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లే అవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేసి..లబ్దిదారులకు అందించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకు ప్లాట్లు ఇచ్చే విధంగా సరికొత్త ఆలోచన చేశారు. ప్లాట్లకు బదులు వివాదాలు లేని విధంగా, క్లియర్ టైటిల్‌తో తక్కువ ధరకే ప్లాట్లు ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను తయారు చేసి లబ్దిదారులకు కేటాయించాలన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుగోలు చేసేవారికి ఆందోళనలుంటాయని..సరైన టైటిల్ ఉందా లేదా..అనుమతులున్నాయా లేదా అనే భయాలుంటాయని వైఎస్ జగన్ తెలిపారు. 


లే అవుట్లను ( Layouts ) ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే అటువంటి ఆందోళనలు, భయాలుండవన్నారు. వివాదాలు లేకుండా, క్లియర్ టైటిల్స్‌తో ఇంటి స్థలాలు ఇవ్వడం ద్వారా తక్కువ ధరకే మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటిస్థలం దక్కుతుందన్నారు. ప్రభుత్వం ( Ap Government ) అభివృద్ధి చేసిన ప్లాట్లను లాటరీ పద్ధతిలో అందించాలన్నారు. మధ్య తరగతి ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతో ఈ ఆలోచన వచ్చిందన్నారు. 


మరోవైపు విశాఖపట్నం అభివృద్ధి ( Visakhapatnam Development ) విషయమై కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. భీమిలి నుంచి భోగాపురం వరకూ సముద్రతీరం వెంబడి ఆరు లైన్ల బీచ్ రోడ్డుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మిస్తున్నామని..విశాఖపట్నానికి ఇదొక చిహ్నంగా మిగిలిపోతుందన్నారు. మంగళగిరి- తాడేపల్లి మున్సిపాల్టీలతో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 


Also read: AP: టీడీపీ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణం రేపు ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook