Ys Jagan Review: కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తూనే..కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు మౌళిక సదుపాయాలు మెరుగుపర్చుకునే దిశగా ఆదేశాలు జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి(Covid pandemic) తగ్గుముఖం పట్టింది. కోవిడ్ నియంత్రణ చర్యలు, కరోనా వ్యాక్సినేషన్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు వినియోగం కావడం లేదని..రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే వ్యాక్సినేషన్ (Corona Vaccination)ప్రక్రియ వేగవంతమవుతుందని వైఎస్ జగన్ తెలిపారు. మే, జూన్, జూలై నెలల్లో 43.38 లక్షల డోసుల్ని ప్రైవేటుకు కేటాయిస్తే..5.24 లక్షల డోసులే వినియోగమయ్యాయన్నారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాయనున్నారు. 


మరోవైపు కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)సన్నద్ధత విషయమై మౌళిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, డీటైప్ సిలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ (Ap cm ys jagan)ఆదేశించారు. పీహెచ్‌సీలలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉంచాలని, జిల్లాల వారీగా నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది నియమించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై కూడా సమీక్షించారు.100 బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. దశలవారీగా మిగిలిన ఆసుపత్రుల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. కొత్త మెడికల్ కళాశాలల కోసం భూసేకరణ పూర్తి చేయాలన్నారు. 


Also read: Vizag Steel Plant Issue: అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా తొలగిస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook