హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి శుక్రవారం సమావేశంకానున్నారు. గోదావరి జలాల వినియోగం అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపైనా ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారని తెలుస్తోంది. ప్రతీ ఏడాది సముద్రంలో కలిసిపోతున్న వేల టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తే, కృష్ణా ఆయకట్టుకు కలిగే ప్రయోజనాలు, తెలంగాణ, ఏపీ పరస్పర సహకారంతో ముందుకు కొనసాగితే కలిగే ప్రయోజనాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ఈ సమావేశానికి వేదిక కానుంది. 


జల వనరుల వినియోగం, పంపకాలు వంటి అంశాలతోపాటు 9, 10వ షెడ్యూల్ సంస్థలు, ఉద్యోగుల విభజన అంశాలను అధికారులు ఈ సమావేశంలోనే కేసీఆర్‌, జగన్‌కు వివరించనున్నారని తెలుస్తోంది.