సంక్షేమ పథకాలు ఆగితే యాక్షన్ తప్పదన్న సీఎం జగన్
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న కష్టకాలంలోనూ ప్రభుత్వ పథకాలు అమలు కావడంలో ఆలస్యం తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న కష్టకాలంలోనూ ప్రభుత్వ పథకాలు అమలు కావడంలో ఆలస్యం తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్దిష్టమైన కాలపరిమితిలోపే ప్రభుత్వ సేవలు, పథకాలు ( Welfare schemes) అందించే విధంగా గ్రామ, వార్డు సచివాలయల్లో సిబ్బందికి లక్ష్యం విధించారు. అర్హులైన లబ్ధిదారులు అందరికీ ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇస్తున్నామని స్పష్టం చేసిన సీఎం జగన్... 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ( అతి ముఖ్యమైన ప్రాజెక్ట్.. ఆలస్యం చేయొద్దు: వైఎస్ జగన్ )
రాష్ట్రవ్యాప్తంగా అర్హతలు కలిగిన అభ్యర్థులు ఎవరు దరఖాస్తు చేసుకున్నా.. పది రోజుల్లోనే రేషన్ కార్డు.. పది రోజుల్లో పెన్షన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ( CM YS Jagan) స్పష్టంచేశారు. ఇప్పటికే 44 లక్షల నుంచి 58 లక్షలకుపైగా పెన్షన్లు పెంచామని.. అర్హులకు రూ.2,250 పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో అవినీతిని నిర్మూలించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. పథకాల అమలుకు సంబంధించిన అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు. కాలపరిమితిలోపు పౌర సేవలు అందించడంలో విఫలమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను హెచ్చరించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..