భారీ వర్షాలు ( Heavy Rains ), వరదలతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Central Home minister Amit shah ) కు లేఖ రాశారు. వరద నష్టం వివరాలు, అంచనా మొత్తాన్ని లేఖలో పొందుపరిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బంగాళాఖాతం ( Bay of Bengal ) లో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగిపొర్లడంతో వరద పరిస్థితులు తలెత్తాయి. అటు ప్రకాశం బ్యారేజ్ ( Prakasam Barrage )కు భారీగా వరద నీరు చేరడంతో పరిస్థితి మరింత విషమించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఆస్థినష్టం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. నష్టం వివరాలు అంచనా మొత్తాన్ని లేఖలో వివరించారు. మొత్తం  4వేల 450 కోట్ల మేర ఆస్థినష్టం వాటిల్లిందని..తక్షణ సహాయంగా వేయికోట్లు విడుదల చేయాలని లేఖ ద్వారా కోరారు. కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా ఇప్పటికే ఆర్ధికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు , భారీ వర్షాలు ముంచెత్తాయన్నారు. 


భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని వైఎస్ జగన్ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు పడ్డాయి. ఈ నెల 13వ తేదీ ఒక్కరోజులోనే  తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద ( Krishna river floods ) పొటెత్తింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల గత మూడురోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు  తరలించారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో జన జీవితం అస్తవ్యస్తమైంది.


వర్షాల కారణంగా రాష్ట్రంలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. విద్యుత్‌ ఉత్పత్తిపైనా వర్షాలు ప్రభావంచూపాయి. ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా రైతాంగం ప్రదానంగా నష్టపోయింది. పంట చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అదే విధంగా కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఏపీలో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణ సహాయంగా వేయి కోట్లు అందించాలని సీఎం జగన్  కోరారు.