YS Sharmila: వైఎస్ షర్మిలపై రేగుతున్న అసమ్మతి, పదవి పోనుందా
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం కరువైంది. పార్టీని పటిష్టంగా నడిపించే నేత లేక ఆ పార్టీ రోజురోజుకూ ఉనికి కోల్పోతోంది. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రభావం కన్పించడం లేదు. సొంత పార్టీలోనే ఆమెపై అసమ్మతి రేగుతోంది. ఇలాగే కొనసాగితే పదవి కూడా పోవచ్చని తెలుస్తోంది.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించగానే పార్టీ పుంజుకుంటుందని అంతా ఆశించారు. కానీ పదవి చేపట్టి ఆరు నెలలు దాటినా ఏ మాత్రం ఫలితం కన్పించడం లేదు. వైఎస్ షర్మిల ఒంటెద్దు పోకడలపై పార్టీలో విమర్శలు చెలరేగుతున్నాయి. అధిష్టానానికి ఫిర్యాదులు సైతం వెళ్తున్నాయి.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుని 8 నెలలు కావస్తున్నా పార్టీ ఇంకా బాలారిష్టాలే దాటలేదు. కాంగ్రెస్ పార్టీకు పునర్ వైభవం ఆశలు కాస్తా నెరవేరే పరిస్థితి కన్పించడం లేదు. రాష్ట్ర విభజన తరువాత చెల్లాచెదురైన పార్టీ నేతలు, కార్యకర్తల్ని కూడా సమీకరించలేని పరిస్థితి నెలకొంది. వైఎస్ షర్మిల నేతృత్వంలో పార్టీ పరిస్థితి మూడు అడుగులు ముందుకి..నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. దీనికితోడు వైఎస్ షర్మిలపై సొంతపార్టీలో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అంతా తానై ఒంటెద్దు పోకడలకు పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అంతర్గత నిర్మాణంలోనే కాదు...రాజకీయంగా కూడా సరైన ప్రతిపక్షంగా రాణించలేకోపోతోంది. పార్టీలో సీనియర్లను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇక పార్టీ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వ్యక్తిగత ఎజెండాతోనే ముందుకు పోతోందనే ప్రచారం సాగుతోంది. కేవలం అన్న జగన్‌పై కక్ష సాధింపు కోసం విమర్శలు చేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ నాయకురాలిగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, పనితీరుపై ఇప్పటి వరకూ విమర్శలు చేయకపోవడంతో కుమ్మక్కయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షం వైసీపీ తప్ప అధికార పార్టీలో ఎందుకు దూకుడు ప్రదర్శించడం లేదనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
అసలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిందే వ్యక్తిగత ఎజెండా నెరవేర్చుకునేందుకనే విమర్శలు కూడా ఉన్నాయి. చేసే విమర్శలు లేదా పనితీరు ఏ మాత్రం దిశా నిర్దేశం లేకుండా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ వర్గానికే పదవులు కట్టబెట్టడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. అన్న జగన్‌ను ఇరుకునపెట్టడమే లక్ష్యంగా వ్యక్తిగత ఎజెండాతో ముందుకుపోతోందనే వాదన గట్టిగా వినబడుతోంది. ఇదే కొనసాగితే పీసీసీ అధ్యక్షురాలిగా పదవి కోల్పోయే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది.
Also read: Seize the Ship: సీజ్ ది షిప్..ఆ అధికారం నీకెక్కడిది పవన్ అంటూ ట్రోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.