ఏపీ ( Ap ) లో కరోనా వైరస్ ( Corona virus ) దాదాపు తగ్గిపోయినట్టే కన్పిస్తోంది. భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో వైరస్ తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కేవలం 1732 కొత్త కేసులు మాత్రమే వెలుగు చూశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాష్ట్రంలో ఇంకా రికార్డు స్థాయిలో కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests ) నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం ( Ap Government ). కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానంగా కరోనా నిర్ధారణ పరీక్షలపైనే దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా రోజుకు 80 వేల వరకూ పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. అక్టోబర్ నెల కంటే ముందు రోజుకు 10-11 వేల కొత్త కేసులు వెలుగుచూస్తుండేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారింది. 


ఇప్పుడు కూడా రోజుకు 70-80 వేల పరీక్షలు నిర్వహిస్తున్నా..కొత్త కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతోంది. రోజుకు  2 వేలలోపు కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 70 వేల 405 మందికి పరీక్షలు నిర్వహించగా..కేవలం 1732 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 8 లక్షల 47 వేల 977కు చేరుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య( Corona active cases ) కేవలం 20 వేల 915కు చేరుకుంది. 


గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా  14 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 6 వేల 828కు చేరుకుంది. గత 24 గంటల్లో 1761 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 88 లక్షల 63 వేల 340 కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  Also read: AP: లివర్, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడ ఇకపై ఆరోగ్య శ్రీలోనే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe