AP Coronavirus: సెకండ్‌ వేవ్‌తో దేశం మొత్తం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి (Corona pandemic) దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు ఇండియాలోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కొత్త కేసుల సంఖ్య(Corona second wave) రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 33 వేల 755 పరీక్షలు చేయగా..3 వేల 263 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 9 లక్షల 28 వేల 664కు చేరుకుంది. కాగా 11 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరులో అత్యధికంగా 5మంది, అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మరణించివారి సంఖ్య 7 వేల 311కు చేరుకుంది. 


మరోవైపు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ( Ap government) అప్రమత్తమైంది. హాట్‌స్పాట్లు భావించే అన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అధికారులు. దీంతో గ్రామాల్లో సైతం కరోనా నియంత్రణ విషయంలో ప్రజా చైతన్యం బాగా కనిపిస్తోంది. పాజిటివ్‌ కేసులు నమోదయ్యే గ్రామాల్లో స్థానికులు స్వచ్ఛందంగా తమ ఊరిలో ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దైనందిక కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ మంది గుమికూడడానికి అవకాశం ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాల విషయంలోనే ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు.


కరోనా కేసులు ( Corona virus cases) నమోదవుతున్న గ్రామాల్లో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయడంతోపాటు బ్లీచింగ్‌ పౌడరును ప్రధాన రోడ్ల వెంట చల్లుతున్నారు. ప్రజలు సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధిస్తున్నారు.


Also read: Rains in ap: ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు, క్రమంగా ఉష్ణోగ్రత తగ్గే సూచన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook