AP COVID-19, krishnapatnam ayurvedic medicine updates : అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. శుక్రవారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి కరోనా సోకినట్టు తేలింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యధికంగా 3,475 కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో చిత్తూరు జిల్లాలో 3,063 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1886 కేసులు, అనంతపురం జిల్లాలో 1818 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1634 కేసులు, గుంటూరులో 1463 కేసులు నమోదయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యల్పంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 721 కరోనా కేసులు నమోదు కాగా ఆ తర్వాత విజయనగరంలో 930, కర్నూలు జిల్లాలో 970 కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రకాశం జిల్లాలో 1296, క్రిష్ణా జిల్లాలో 1292, నెల్లూరు 1246, శ్రీకాకుళంలో 1143 కేసులు గుర్తించారు. 


Also read : Telangana: తెలంగాణ కరోనా బులెటిన్.. కొత్తగా మైక్రో కంటెన్మైంట్ జోన్స్ ఏర్పాటు


అదే సమయంలో 20,811 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 104 మంది మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 9,904 కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 15,42,079 కి చేరుకున్నాయి. మరో 13,23,019 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


ఇదిలావుంటే, మరోవైపు నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నంలో ఆనందయ్య (Krishnapatnam corona ayurvedic medicine) అనే వ్యక్తి కరోనాకు ఆయుర్వేదం మందు ఇస్తున్నారనే ప్రచారంతో శుక్రవారం ఉదయం నుంచి క్రిష్ణపట్నం మొత్తం జాతరను తలపించింది. అయితే కరోనా ‌గైడ్‌లైన్స్ పాటించేందుకు వీలు లేకపోగా.. అసలు కృష్ణపట్నం ఆయుర్వేద ఔషధం ఎంత మేరకు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందో నిగ్గు తేల్చే యోచనతో ఏపీ సర్కారు ఆయుర్వేదం మందు పంపిణీకి బ్రేకులేసింది. క్రిష్ణపట్నం కరోనా ఆయుర్వేదం మందు శాంపిల్స్‌ని సైతం ఐసీఎంఆర్ (ICMR)కి పంపించి పరిశోధన చేయిస్తోంది.


Also read : Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook