Diabetes treatment: టైప్ 1 డయాబెటిస్‌కు చికిత్స వచ్చేసిందా అంటే చైనా పరిశోధకులు అవుననే చెబుతున్నారు. ఆధునిక వైద్య శాస్త్రంలో సంచలనంగా మారిన స్టెమ్ సెల్ థెరపీతో టైప్ 1 డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు. ఈ థెరపీ ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం. చైనా ప్రస్తావిస్తున్న స్టెమ్ సెల్ థెరపీ గురించి లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 మిలియన్ల మంది టైప్ 1 డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 60 ఏళ్లు పైబడినవాళ్లు 2 మిలియన్ల మంది ఉంటే 20-59 ఏళ్ల వయస్సు కలిగినవాళ్లు 6 మిలియన్లు, 20 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్నవాళ్లు 2 మిలియన్లు మంది ఉన్నారు. ఇప్పటి వరకూ ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. లైఫ్‌స్టైల్ మార్చుకోవడం, మందులు వాడటం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. అయితే చైనా పరిశోధకులు మాత్రం చికిత్స ఉందంటున్నారు. అంతేకాదు..ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చంటున్నారు. స్టెమ్ సెల్ థెరపీ ద్వారా మధుమేహాన్ని పూర్తిగా నయం చేయవచ్చని చెబుతున్నారు. ఇదే నిజమైతే సంచలనం కానుంది. వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యాయం తెరపైకి రానుంది.
టైప్ 1 డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. దాంతో రక్తంలో గ్లూకోజ్ పరివర్తనం జరగదు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగిపోతుంది. చైనాలో ప్రచురితమైన మేగజీన్ ప్రకారం పదేళ్ల నుంచి టైప్ 1 డయాబెటిస్ బాధపడుతున్న 25 ఏళ్ల మహిళకు స్టెమ్ సెల్ బదిలీ చేసిన రెండున్నర నెలల తరువాత ఈ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడింది. స్టెమ్ సెల్స్ ట్రాన్స్‌ప్లాంట్ థెరపీలో ఇన్సులిన్ తయారు చేసే డ్యామేజ్ సెల్స్ స్థానంలో హెల్తీ వ్యక్తి సెల్స్ బదిలీ చేస్తారు. ఈ థెరపీ సరికొత్త రివల్యూషన్ కానుంది. చైనా పరిశోధకుల ప్రకారం స్టెమ్ సెల్ థెరపీతో కేవలం మధుమేహాన్నేకాకుండా కేన్సర్ చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.
Also read: White Hair Problem: జుట్టు ఎందుకు తెల్లబడుతుంది, మీ డైట్‌లో ఈ విటమిన్ ఉంటే వైట్ హెయిర్ సమస్యకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.