ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి (Corona Cases In AP) కోరలు చాస్తోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో 79 మందికి కోవిడ్‌19 పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో 35 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్‌ అయ్యారు. ఏపీలో తాజాగా నలుగురు వ్యక్తులను కరోనా మహమ్మారి బలిగొంది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 68కి చేరుకుంది.  చావు అంచులదాకా వెళ్లిన జింక.. చివర్లో ట్విస్ట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో ఏపీలో 8,066 శాంపిల్స్‌ పరీక్షించగా 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలపి రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,279కి చేరింది. ఇందులో చికిత్స అనంతరం 2,244 మంది డిశ్ఛార్జ్‌ కాగా, ప్రస్తుతం 967 మంది చికిత్స పొందుతున్నారు.   నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్


రాష్ట్రంలో తాజాగా నలుగురు మరణించగా.. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు, కర్నూలు జిల్లాలో మరొకరు కోవిడ్‌19 (COVID-19) కారణంగా మరణించిన వారిలో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 119 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, ఇందులో కరోనా నుంచి ఒక్కరు కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 573 మందికి కరోనా పాజిటివ్‌ తేలగా, ప్రస్తుతం 362 యాక్టీవ్‌ కేసులున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
 గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్