Pithapuram: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, నేరాలు పెరిగిపోతుండడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. హోంమంత్రి వంగలపూడి అనిత పనితనంపై పరోక్షంగా తప్పుబట్టారు. తాను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని పేర్కొన్నారు. ఒక అడుగు ముందుకు వేసి తానే హోమంత్రిగా బాధత్యలు తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై పవన్‌ అసహనం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Waqf Board: వైఎస్సార్‌సీపీ సంచలన ప్రకటన.. మోదీకి వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ నిర్ణయం


కాకినాడ జిల్లాలోని తన నియోజకవర్గం పిఠాపురంలో సోమవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి.. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోంమంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటా. హోంమంత్రి అనిత సమీక్ష చేయాలి. శాంతి భద్రతలు చాలా కీలకం. పోలీసులు మర్చిపోకండి' అని సూచించారు.


Also Read: MP Vemireddy: 'నాకు బొకే ఇయ్యాలే'.. అలిగి స్టేజీ దిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ


'అభివృద్ధి ఉండాలి కానీ కలుషితం లేని ఫార్మా కంపెనీలు రావాలి. గోదావరి జిల్లాల్లో నీళ్లున్నాయి. పశ్చిమ గోదావరిలో తాగేందుకు నీరు లేదు. అరబిందో ఫార్మా కంపెనీ,ఇతర కలుషిత జలాలు వదిలే ఫ్యాక్టరీలు ప్రజాశ్రేయస్సు దృష్టిలో ఉంచుకోవాలి' అని పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ సూచించారు. దివిస్ అరబిందో పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు.


'అభివృద్ధి చెందిన దేశాలు సాధించలేనిది భారతదేశం చేసింది. సామాజిక న్యాయం  నా ధ్యేయం' అని పవన్‌ కల్యాణ్ ప్రకటించారు. '3, 5 ఏళ్ల పిల్లలపై అత్యాచారాలు చేసే దుర్మార్గులు ఉన్నారు. గత ప్రభుత్వ వారసత్వం ఇపుడు చూస్తున్నాం. చంద్రబాబు, నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. నన్ను, బాబును చంపేస్తామని.. నా కూతుళ్లపై  అఘాయిత్యం చేస్తానని హెచ్చరించారు' అని గుర్తు చేశారు. 


'నా గురించి తప్పుగా మాట్లాడితే స్పందించడానికి అధికారులకు భయం. డీజీపీకి బాధ్యత లేదా?' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు. 'బలమైన చట్టాలు ఉన్నా అమలు చేయడం లేదు' అని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయండి, ఇళ్లలో ఉన్న మహిళలను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. 'మూడు నెలలుగా అఘాయిత్యాలు పెరిగాయి. ఇప్పుడు అధికారులు పని చేయమంటే మీనమేషాలు లెక్కపెడుతున్నారు' అని అధికారుల తీరుపై మండిపడ్డారు.


'మూడేళ్ల ఆడపిల్లను రేప్ చేస్తే కులం చూస్తారా? పోలీసులు ఎందుకు పట్టించుకోరు. అధికారంలో ఉన్నామని సహనంతో ఉన్నాం. చేతకాక కాదు' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తప్పు చేసిన వాళ్లని మడత పెట్టి కొట్టండి పిలుపునిచ్చారు. 'హోంమంత్రి అనితకు బాధ్యత వహించాలని చెబుతున్నా. నేను హోమ్ బాద్యతలు తీసుకుంటే వేరేలా ఉంటుంది. అవసరమైతే హోమ్ బాధ్యతలు తీసుకుంటా' అని సంచలన ప్రకటన చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.