Women Cops Duties: మహిళా పోలీసులకు ఆ పనులు చెప్పకండన్న డీజీపీ
AP DGP Rajendranath Reddy About Women Cops Duties: మహిళా పోలీసులను పోలీస్ విధులకు వినియోగించవద్దు అని పేర్కొంటూ అన్ని కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, అందరు రేంజ్ డీఐజీలు, అన్ని జిల్లాల ఎస్పీలకు ఏపీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
AP DGP Rajendranath Reddy About Women Cops Duties: మహిళా పోలీసులను పోలీస్ విధులకు వినియోగించవద్దు అని పేర్కొంటూ అన్ని కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, అందరు రేంజ్ డీఐజీలు, అన్ని జిల్లాల ఎస్పీలకు ఏపీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందించే ముఖ్య ఉద్దేశంతో మహిళా పోలీస్ వ్యవస్థ ఏర్పాటైందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తుచేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీసులను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్, శాంతి భద్రతలు వంటి విధులకు వినియోగించడం, తరచుగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అందుకు విరుద్ధంగా మహిళా పోలీసులను పోలీస్ విధులకు వినియోగించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి : Godavari floods: ధవళేశ్వరం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. భయం గుప్పిట్లో ముంపు గ్రామాల ప్రజలు..
పోలీసు ఉన్నతాధికారుల్లో కొంతమంది మహిళా పోలీసులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తమ అవసరాలకు సెలువులు ఇవ్వకుండా అదనపు విధులు నిర్వర్తించేలా చేస్తూ తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారు అంటూ గతంలో కొంతమంది మహిళా పోలీసులు బహిరంగంగానే ఉన్నతాధికారులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి జారీచేసిన ఆదేశాలతో ఆ పరిస్థితి రూపుమాసిపోయే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : Gangadhara Nellore MLA Politics: గంగాధర నెల్లూరులో ఎమ్మెల్యేకు ఎదురుగాలి, ఈసారి టీడీపీ పరిస్థితేంటి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి