AP Govt- WhatsApp: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్‌ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ (ఏపీడీసీ) ఇప్పుడు వాట్సాప్‌ సేవలను (WhatsApp Services) కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్‌నెట్‌ వాడేవారి సంఖ్య వేగంగా పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రంలో ఇలాంటి వేదిక అవసరాన్నీ, ప్రాముఖ్యతనూ గుర్తించిన వాట్సాప్‌ ఇండియా ఏపీడీసీ (Andhra Pradesh digital corporation) వాట్సాప్‌ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మరింత వేగంగా అందనుంది. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతోపాటు... ఈ విషయాలపై తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కూడా ఈ వాట్సాప్‌ సేవలు మరింతగా ఉపయోగపడతాయని ఏపీడీసీ భావిస్తోంది.


ఈ సేవల విస్తరణలో భాగంగా త్వరలో పూర్తిస్థాయి వాట్సాప్‌ చాట్‌బోట్‌ సేవలను కూడా ఏపీడీసీ అందించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల సమాచారాన్ని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేయడంలో ఏపీడీసీ ప్రారంభించబోయే ఈ వాట్సాప్, చాట్‌బోట్‌ సేవలు ఉపయోగపడనున్నాయి.


''ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారి ప్రగతిశీల అజెండాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య డిజిటల్‌ మాధ్యమాల ద్వారా వారధిలా ఉండాలన్న ఏపీడీసీ లక్ష్యానికి ఈ ముందడుగు ఎంతో సాయపడుతుంది''-  చిన్న వాసుదేవరెడ్డి, ఎండీ, ఏపీడీసీ వైస్‌ ఛైర్మన్


 ''రాష్ట్రంలో ఇ–గవర్నెన్స్‌ని మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు గర్వంగా ఉంది. వైవిధ్యభరితమైన, ప్రతి అవసరానికీ తగిన ఇ–గవర్నెన్స్‌ పరిష్కారాలు రూపొందించేందుకు మా వాట్సాప్‌ వ్యాపార వేదిక ద్వారా మేం నిరంతరం పనిచేస్తాం. వీటివల్ల పౌరులతో వేగవంతమైన, సులభతరమైన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సత్సంబంధాలు నెరిపేందుకు వీలవుతుంది. మేం రూపొందించిన పరిష్కారాలను దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థలకు అందించి, వాటితో కలిసి పనిచేసేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తాం..'' - శివనాథ్‌ ఠుక్రాల్‌,  వాట్సాప్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ అధిపతి 



Also Read: NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ... తెలుగు ప్రజలకు ఆర్బీఐ శతకోటి కానుక 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి