On 12th June AP EAMCET 2023 Results going to Release: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెన్త్, ఇంటర్ ఫలితాల తరహాలోనే సాధ్యమైనంత త్వరగా ఎంసెట్ రిజల్ట్స్‌ను విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్ 2వ తేదీన ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎంసెట్ ఫలితాలపై తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌కు మే 15 నుంచి 19 వరకు, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు మే 22 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AP EAPCETకు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్)కు మొత్తం 3,37,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055 మంది అప్లై చేసుకోగా..  అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 99,388 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు విభాగాలకు 979 మంది విద్యార్థులు అప్లై చేశారు. AP EAPCET 2023 పరీక్షలు జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వ‌ర్యంలో జరిగాయి. 


విద్యార్థులు AP EAPCET ఫలితాలను cets.apsche.ap.gov.in. లేదా manabadi.co.in. వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్లను ఎంటర్ చేసిన పరీక్ష ఫలితాలు చూసుకోవచ్చు. అనంతరం తమ ర్యాంక్‌కార్డులను కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.  AP EAPCET లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ యాడ్ చేసి ఎంసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. తెలంగాణలో ఇంటర్ వెయిటేజీని తీసేసిన విషయం తెలిసిందే. 


Also Read: CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..


ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి


  • అధికారిక cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి

  • ఫలితాలు అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

  • మీ హాల్‌ టికెట్ నంబరు ఎంటర్ చేయండి

  • తరువాత మీ ర్యాంక్, మార్కులు స్క్రీన్‌పై కనిపిస్తాయి

  • ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి


Also Read: BGMI Returns: పబ్జీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. BGMI వచ్చేసింది.. కండీషన్స్ అప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook