AP EAPCET 2024 Results: ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్ష ముగిసి చాలా రోజులైంది. కొత్త ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ కోసం వేచి చూడటంతో ఫలితాల విడుదలలో ఆలస్యమైంది. ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https://cets.apsche.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతి యేటా AP EAPCET పరీక్ష జరుగుతుంటుంది. ఈ ఏడాది ఈఏపీసెట్ 2024 పరీక్ష మే 23నే ముగిసినా ఫలితాల విడుదలలో ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో కాకినాడ జేఎన్టీయూ ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను ఇవాళ సాయంత్రం విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు మే 16 నుంచి 23 వరకూ జరిగాయి. వాస్తవానికి మే నెలాఖరుకే ఫలితాలు విడుదల కావల్సి ఉన్నా ఎన్నికల ఫలితాలు, వైసీపీ ప్రభుత్వం ఓటమి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ రాజీనామా కారణాలతో ఆలస్యమైంది. రాష్ట్రంలోని ప్రైవేట్ వర్శిటీల్లో ఇప్పటికే అడ్మిషన్లు జరుగుతున్నాయి. దాంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ఇంకా సమయముంది. ఈలోగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. 


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,62,851 మంది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు దరఖాస్తు చేసుకోగా 3,39,139 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,58,373 మంది పరీక్షలకు హాజరైతే, అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలకు 80,766 మంది హాజరయ్యారు. ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఉంటుంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను  cets.apsche.ap.gov.in లేదా https://cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు. ఇవాళే ఫలితాలతో పాటు అడ్మిషన్లకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఖరారు కానుంది.


Also read: Dates Benefits: పీరియడ్స్ సమస్యలకు చెక్, రోజుకు 3-4 తింటే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook