AP EAPSET: ఏపీ ఈఏపీసెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండి ఇలా..
AP EAPSET: ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏపీఈఏపీసెట్-2023 వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP EAMCET Hall Ticket 2023 Released: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. వీటిని ఏపీఈఏపీసెట్-2023 వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈఏపీసెట్ 2023కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, వ్యవసాయ, ఔషధ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 అప్లికేషన్స్ వచ్చినట్లు తెలిపారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 15 నుంచి 19 వరకు జరుగుతాయని... అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. హాల్ టికెట్లు ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి.
కాసేపట్లో ఇంటర్ ఫలితాలు
మరోవైపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మార్చి/ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
600కు 600 మార్కులు
ఇంకో వైపు తమిళనాడు బోర్డు ఎగ్జామ్స్ లో ఓ విద్యార్థిని మొత్తం 600 మార్కులకుగాను 600 సాధించింది. మార్చిలో జరిగిన ప్లస్ టూ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో దిండిగల్లుకు చెందిన నందిని అనే బాలిక 100 శాతం మార్కులు సాధించి సంచలనం సృష్టించింది.
Also Read: Manipur Violence News: మణిపూర్‌లో హింస.. ఆంధ్రా విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook