ఏపీ ఈసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఈసెట్‌లో 98.37 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈనెల 20 నుంచి ర్యాంకు కార్డుల జారీ చేయనున్నారు. జేఎన్టీయూ, అనంతపురం నిర్వహించిన ఈ పరీక్షకు 33, 637 మంది హాజరయ్యారు. వీరిలో 26,806 మంది అబ్బాయిలు ఉత్తీర్ణత పొందగా, 6,816 మంది అమ్మాయిలు ఉన్నట్లు చెప్పారు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.inతో పాటు Manabadi.comలలో చూడవచ్చు.
 

టాపర్స్ వీళ్లే....


  •     బయోటెక్నాలజీలో ఫస్ట్‌ ర్యాంక్‌-ఉమామహేశ్వరరావు (తూ.గో)

  •     సిర‌మిక్ టెక్నాల‌జీలో ఫస్ట్‌ ర్యాంక్- పిల్లి లోకేష్ (నెల్లూరు)

  •     మైనింగ్‌ లో ఫస్ట్‌ ర్యాంక్- ఐ శివ‌కుమార్ (మంచిర్యాల‌)

  •     ఫార్మసీలో  ఫస్ట్‌ ర్యాంక్- ఎన్. తేజ‌నాగవిశాలి (కాకినాడ‌)

  •     సివిల్‌లో ఫస్ట్‌ర్యాంకు- సోమారాకేష్ (వ‌రంగ‌ల్‌)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ఈసెట్‌ ఫలితాలు 2018 కోసం..


  • ఏపీ ఈసెట్‌ పరీక్ష అధికారిక లింక్‌ను  sche.ap.gov.in సందర్శించండి.

  • లింకుపై క్లిక్ చేయండి

  • మీ రోల్ సంఖ్య మరియు ఇతర వివరాలను నమోదు చేయండి

  • సబ్ మిత్ బటన్ పై  క్లిక్ చేయండి.

  • ఫలితాలను చూసి మీ ర్యాంక్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

  • ఏపీ ఈసెట్‌ ఫలితాలు 2018 కౌన్సెలింగ్ తేదీల వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో  సందర్శించండి.


కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాలు


  • ఈసెట్‌ 2018 ర్యాంకు కార్డ్/ అడ్మిట్ కార్డు

  • 10 వ తరగతి మార్క్ షీట్

  • ఇంటర్మీడియట్/ 12 వ తరగతి మార్క్ షీట్

  • డిప్లొమా లేదా డిగ్రీ మార్క్ షీట్

  • 7 అకాడమిక్ సంవత్సరాల బోనోఫైడ్ సర్టిఫికేషన్

  • ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ (టీసీ)

  • కులం / ఆదాయము / పీహెచ్ / ఎన్సీసీ/ స్పోర్ట్స్ సర్టిఫికేట్