10వ తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ వైఖరి ఇదే
ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత 10వ తరగతి పరీక్షలు చేపడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చిచెప్పారు. మంగళవారం అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత 10వ తరగతి పరీక్షలు చేపడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చిచెప్పారు. మంగళవారం అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం మంత్రి సురేష్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.
Also read : ఐటి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ''లాక్‌డౌన్ పూర్తయ్యాక ఏపీలో 10వ తరగతి పరీక్షల తేదీల షెడ్యూల్‌ని విడుదల చేస్తాం'' అని అన్నారు. సోషల్ డిస్టన్సింగ్ నిబంధనలు పాటిస్తూనే 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కేంద్రం ఆదేశాల ప్రకారం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదు కనుక ముందుగా చెప్పినట్టుగా మే 3వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తుందా లేదా అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
Also read : ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ జారీచేసిన ఆదేశాలపై హై కోర్టు స్టే
లాక్ డౌన్ కారణంగా విద్యార్థుల చదువులు దెబ్బతినకూడదనే ఉద్దేశంకో వారికి పరీక్షలు నిర్వహించే వరకు సప్తగిరి టీవీ ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు సప్తగిరి ఛానల్ ద్వారా ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రోజుకు రెండు గంటల పాటు పాఠాలు విని సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా సూచించారు. 10వ తరగతి స్టూడెంట్స్ పరీక్షలకు సన్నద్ధం అవడానికి ఇదొక చక్కటి అవకాశంగా భావించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..